Calcium Rich Foods:వీటిని తీసుకుంటే కాల్షియం లోపం అనేది అసలు ఉండదు…ముఖ్యంగా పిల్లల్లో…
calcium Rich Foods : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో కూడా కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారంలో మార్పులు చేసుకుంటే కాల్షియం లోపం నుండి బయట పడవచ్చు. కాల్షియం లోపం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.
కాల్షియం లోపం కారణంగా ఎముకల సాంద్రత తగ్గి ఎముకల ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. అలాగే నీరసం,నిస్సత్తువ ఉండి ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో కాల్షియం లోపం ఉంటే మాత్రం అసలు అశ్రద్ద చేయకూడదు. ఇప్పుడు చెప్పే మూడు ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
రాత్రి సమయంలో నాలుగు బాదం పప్పులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన బాదం పప్పులను తొక్క తీసి తినాలి. ఈ విధంగా రోజు తింటూ ఉంటే బాదంలో ఉండే కాల్షియం ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా ఉండేలా చేస్తుంది. మానసిక ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది.
అలాగే ప్రతి రోజు నల్ల నువ్వులను ఏదో ఒక రూపంలో ఒక స్పూన్ మోతాదులో పెడుతూ ఉండాలి. ఇక జున్నులో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. వారంలో రెండు సార్లు తప్పనిసరిగా జున్నును పిల్లలకు పెట్టె విధంగా చూసుకోవాలి. ఈ మూడు ఆహారాలను తీసుకుంటే పిల్లలు మరియు పెద్దవారిలో కూడా కాల్షియం లోపం తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u