Uncategorized

Ulava Charu:ఉలవచారు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి.. రుచి సూపర్ గా ఉంటుంది

Ulava Charu: ఉలవచారు రుచిని ఎప్పుడైన టేస్ట్ చేసారా,ఎంతో బలాన్ని ఇచ్చే,టేస్ట్ లో అదరగొట్టే, ఉలవచాలు ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉలవలు – 1కప్పు
నీళ్లు – 2 లీటర్లు
రసం పొడి కోసం..
మెంతులు – 1/2టేబుల్ స్పూన్
జీలకర్ర -1/2టేబుల్ స్పూన్

చారు కోసం..
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
ఇంగువ – 1/4టీ స్పూన్
వెల్లుల్లి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -1
చింతపండు గుజ్జు – 3/4కప్పు
బెల్లం – 35 గ్రాములు
కారం పొడి – 1/2టేబుల్ స్పూన్
పసుపు – 1/2టేబుల్ స్పూన్
మసాలా కోసం – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1/2టేబుల్ స్పూన్
ఎండుమిర్చి -1
కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ విధానం
1.ఉలవలను శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీళ్లు పోసి, కనీసం 15 గంటలు నానపెట్టాలి.
2. మరుసటి రోజు, పప్పును, ప్రెజర్ కుక్కర్ లో వేసి, ఇంకా కొన్ని నీళ్లు పోసి, 20 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
3. ఉడకపెట్టిన ఉలవల నుంచి, నీటిని వడకట్టుకుని, పక్కనపెట్టుకోవాలి.
4.వడకట్టుకున్న ఉలవలను, కొద్దిగా నీళ్లు తీసుకుని, పేస్ట్ లా చేసుకోవాలి.
5. స్టవ్ పై బాండీ పెట్టుకుని, మెంతులు , జీలకర్ర, వేయించుకుని మెత్తని పొడి చేసుకోవాలి.
6. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేపుకోవాలి.

7. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మరియు ఉప్పు వేసి ఫ్రై చేయాలి.
8. వేగిన ఉల్లిపాయల్లోకి, చింతపండు గుజ్జు వేసి, మరగనివ్వాలి.
9. మరుగుతున్న చింతపండు గుజ్జులో కారం, పసుపు వేసుకోవాలి.
10. అందులోకి ఉలవల చారు, మరియు పేస్ట్ కలపి, చిక్కపడే వరకు ఉడికించాలి.
11. రసం మరుగుతున్నప్పుడు, వన్ స్పూన్, జీలకర్ర , మెంతుల పొడిని వేసి, బెల్లం కూడా యాడ్ చేసి, మరింత చిక్కపడనివ్వాలి.
12.చిక్కటి రసాన్ని, వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
13.ఇప్పుడు ఉలవచారు లోకి, తాళింపు వేసుకుంటే, ఉలవ చారు రెడీ అయినట్లే.