BusinessKitchen

Hydroponics gardening system బిజీగా ఉండే వాళ్ళకి ఈ డివైజ్ తో గార్డెనింగ్ చాలా సులభంగా చేయవచ్చు

Hydroponics gardening system: ఈ బిజీ జీవనశైలిలో గార్డెనింగ్( Gardening ) అంటే ఇష్టం ఉండి..గార్డెనింగ్ చేయటానికి తీరిక లేని వారికీ Hydroponics gardening system బాగా ఉపయోగపడుతుంది.

ఈ సిస్టం ద్వారా పాలకూర, బచ్చలి కూర వంటి వాటితో పాటు టమోటా, కొత్తిమీర, గులాబీ, చామంతి వంటి ఇష్టమైన మొక్కలను పెంచుకోవచ్చు.ఈ డివైస్ లో త్రీ లైట్ సెట్టింగ్ అమర్చబడి ఉంటుంది.

ముందుగా రెడ్ కలర్ లైట్ ను విత్తనాలు వేసేటప్పుడు, బ్లూ లైట్ ను మొక్క ఎదుగుతున్నప్పుడు, ఇక సన్ లైక్ లైట్లు పువ్వులు విరబూస్తున్నప్పుడు లేదా పండ్లు కాస్తున్నప్పుడు సెట్ చేసుకోవాలి.

ఈ డివైస్ లో ఉండే మొక్కలకు నీటిని అందించడం కోసం ఒక ప్రత్యేకమైన హోల్ ఉంటుంది.అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి న్యూట్రిన్ టాబ్లెట్స్ వేస్తూ ఉండాలి.

బయట పెంచే మొక్కలతో పోలిస్తే ఈ డివైజ్ లో పెంచే మొక్కలు 5 రెట్లు వేగంగా పెరుగుతాయి. ఈ డివైస్ ను తరచూ చెక్ చేసే అవసరం ఉండదు. కాబట్టి గార్డెనింగ్ చేసే తీరిక లేని వారికీ బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు.