Kitchenvantalu

Madras Ven Pongal:తమిళనాడు స్టైల్ వెన్నలాంటి కట్టెపొంగలి ఈ కొలతలతో చేస్తే ఎంత రుచిగా వుంటుందో..

Madras Ven Pongal: టెంపుల్స్ లో పూజల సమయంలో,చేసుకునే పొంగల్ ఎలా తయారు చేయాల్లో చూద్దాం. బియ్యం పెసరపప్పుతో, ఉడికించి, మిర్యాల ఘాటు తగిలించి, కమ్మని మదరాసీ పొంగల్ తయారీ చూడండి.

కావాల్సిన పదార్ధాలు
కొత్త బియ్యం – 1 కప్పు
పెసరపప్పు – 1/2కప్పు
ఉప్పు –సరిపడా
కరివేపాకు – 5 రెమ్మలు
నీళ్లు – 4.5 కప్పు
నెయ్యి – 1/2కప్పు
జీడిపప్పు – 1/2కప్పు
మిరియాలు – 1/2టేబుల్ స్పూన్
అల్లం తురుము – 1.5 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2టేబుల్ స్పూన్
ఇంగువ – 1/2టీ స్పూన్

తయారీ విధానం
1.బియ్యం పెసరపప్పు, శుభ్రంగా కడిగి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి, గంట పాటు నాన పెట్టుకోవాలి.
2.గంట తర్వాత, కుక్కర్ లో నానిన బియ్యం కప్పు, నీళ్లు , ఉప్పు వేసి, మీడియం ఫ్లేమ్ పై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.పొంగల్ ఉడికిన తర్వాత, రెండు చంచాల నెయ్యి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.

4.ఇప్పుడు వేరొక ప్యాన్ లో నెయ్యి వేడి చేసి, మిరియాలు వేసి, చిత్లాక, అల్లం తురుము వేసుకోవాలి.
5. వేగిన అల్లం తురుములో, జీలకర్ర, జీడిపప్పు, వేసుకుని, మరో రెమ్మ కరివేపాకు వేసి, చివరగా, ఇంగువ వేసి,పోపు ఎర్రగా వేపుకోవాలి.
6. వేగిన తాళింపులో పొంగల్ లో వేసి కలుపుకుని, చివరగా రెండు చెంచాల నెయ్యి వేసి, మూత పెట్టి 10 నిముషాల తర్వాత సెర్వ్ చేసుకుంటే, కమ్మటి పొంగల్ రెడీ అయినట్లే.
Click Here To Follow Chaipakodi On Google News