Kitchenvantalu

Kerala Avial Recipe: టేస్టీ.. టేస్టీ.. కేరళ స్పెషల్‌ అవియల్‌ చేసేద్దామా.. ఒకసారి తింటే వదిలిపెట్టరు

Kerala Avial Recipe: పచ్చికొబ్బరి ,కొబ్బరి నూనెల వంటకాలకు కేరళ ఫేమస్.వంటికి బలాన్నిచ్చే కొబ్బరితో అవియల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంప – 1
బీన్స్ – సరిపడా
బూడిద గుమ్మడి ముక్కలు – ¼ kg
క్యారెట్ – 2
అరటి కాయ – 1
తాజా కొబ్బరి తురుము – 1 కప్పు
కొబ్బరి నూనె – 1 ½ టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 3
ఆవాలు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ విధానం
1.ముందుగా అన్ని కూరగాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు ప్యాన్ లో ఒక కప్పు నీళ్లను మరిగించి తరిగిన బంగాళదుంపలు,బీన్స్ ,బూడిద గుమ్మడి ముక్కలు,క్యారట్ ,అరటి ముక్కలను వేసి ఉడికించాలి.
3.అందుకలోకి 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి.
4.కూరగాయలు ఉడుకుతున్నప్పుడు పసుపు వేసుకోవాలి.

5.ఇప్పుడు మిక్సి జార్ లోకి కప్పు తాజా కొబ్బరి ,పచ్చిమిర్చి,జీలకర్ర,కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
6. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో వేసుకోని కొబ్బరిని బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అవియల్ కోసం అందులోకి ఉడికిన కూరలోకి 1 టీ స్పూన్ కొబ్బరి నూనె చిలికిన పెరుగు వేసి కలుపుకోవాలి.
8.స్టవ్ పై వేరోక ప్యాన్ పెట్టుకోని తాలింపు కోసం కొబ్బరినూనె వేసుకోని అందులోకి ఆవాలు,ఎండుమిర్చి,రెండు రెమ్మల కరివేపాకు వేసి వేగిన తాలింపును అవియల్ లో కలుపుకుంటే రెసిపీ రెడీ.