Kitchenvantalu

Chinta Chiguru Pappu:విటమిన్ – C ఎక్కువగా ఉండే చింతచిగురుతో పప్పు.. కొంచెం పుల్లగా మరింత రుచిగా..

Chinta Chiguru Pappu:.చింతచిగురు పప్పు.. ఎన్ని వంటలు చేసుకున్న పప్పుకు సరిరావు. పప్పు కాంబినేషన్ లో చింతచిగురు కలిపి చేసారంటే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
చింతచిగురు – 1 కప్పు
కంది పప్పు – 1 కప్పు
పచ్చిమిర్చి – 5-6
జీలకర్ర – ½ టీ స్పూన్
మెంతులు – ¼ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
కొత్తిమీర – ¼ కప్పు
ఉప్పు – తగినంత
నూనె – ½ స్పూన్
తాలింపు కోసం..
ఉల్లిపాయ – 1
వెల్లుల్లి రెబ్బలు – 4-5
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2-3
కరివేపాకు – ¼ కప్పు
నూనె – 1 ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా చింత చిగురును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు కుక్కర్ లో కంది పప్పు జీలకర్ర,మెంతులు,పసుపు ,పచ్చిమిర్చి ,నూనె ,రెండు కప్పుల నీళ్లను వేసి కుక్కర్ మూతపెట్టి రెండు,మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.ప్రెజర్ పోయినతర్వాత పప్పును మెత్తగా మెదుపుకోని,సరిపడా ఉప్పు ,నీళ్లను మిక్స్ చేసుకోవాలి.
4.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,ఉల్లిపాయలు వేసుకోని వేపుకోవాలి.
5.ఉల్లిపాయలు వేగాక శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురును తాలింపులో వేసి సాఫ్ట్ గా వేపుకోవాలి.
6.వేగిన తాలింపులో ఉడికిన పప్పును కలుపుకుంటే కమ్మని పప్పు చింతచిగురు రెడీ.