Devotional

Karthika Masam 2023:కార్తీక మాసంలో దీప దానం ఏ రోజున ఏ సమయంలో చేస్తే అఖండ ఐశ్వర్యం,పుణ్యం కలుగుతాయో..

Karthika Masam 2023:కార్తీక మాసంలో స్నానాలు,దానాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి దానాలలో దీప దానం ఒకటి. కార్తీక మాసంలో దీప దానం చేస్తే కోటి గోదానాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనం దీప దానం ఎలా చేయాలి. కార్తీక మాసంలో ఏ రోజున దీప దానం ఇస్తే మంచిది. ఏ సమయంలో అంటే ఉదయం ఇస్తే మంచిదా సాయంత్రం ఇస్తే మంచిదా వంటి విషయాలను తెలుసుకుందాం.

అలాగే కార్తీక మాసంలో దీప దానం సహ్యతాం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. దీపం అనేది అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో దానం ఇచ్చే దీప దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో చేసే దానాలు అన్ని ఒక ఎత్తైతే దీప దానం ఒక ఎత్తని మన శాస్త్రాల్లో ఉంది.

దీప దానం అంటే వెండి ప్రమిదలో ఆవునెయ్యి, వత్తి వేసి వత్తికి బంగారు తీగ గుచ్చి వెలిగించి దానం ఇస్తారు. ఇలా దానం చేయటం వలన పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుంది. దీప దానంను ప్రదోష సమయంలో చేయాలి. సాయంత్రం 5.30గంటల నుండి 7 గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రదోష సమయం అని అంటారు.

దీప దానాన్ని కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి,క్షిరభ్ది ద్వాదశి,కార్తీక పౌర్ణమి రోజున చేస్తే అఖండమైన ఐశ్వర్యం, పుణ్యం కలుగుతాయి. అయితే దీప దానంతో పాటు బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వాలి. స్వయంపాకంలో బియ్యం, పెసరపప్పు, కూరగాయలు, ఉప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, పెరుగు, బెల్లం ఒక పుట భోజనానికి అవసరమైన వస్తువులు ఉండాలి.

ఇలా ఇచ్చిన స్వయంపాకంను వండుకొని తింటేనే మనకు పుణ్యం వస్తుంది. అందువల్ల స్వయంపాకం దానం ఇచ్చినప్పుడు పేద బ్రాహ్మణుడికి ఇస్తే మంచిది. వారు తప్పనిసరిగా వండుకొని తింటారు. ఈ విధంగా దీప దానం చేయటం వలన సిరి సంపదలు,విద్యాభివృద్ధి,ఆయుర్ వృద్ధి కలుగుతాయి.