Devotional

Lucky Zodiac Sign: నవంబర్ 27 కార్తీక పౌర్ణమి నుంచి ఈ 5 రాశులకు రాజయోగం ప్రారంభం.. మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..

Kartika Purnima Lucky Zodiac Sign: కార్తీక మాసంలో ప్రతి రోజు పర్వదినమే అయినా కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కార్తీక మాసం శివ,కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది.ఈ మాసంలో ఏ పూజ చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి కొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశి వారు పౌర్ణమి రోజు నుంచి స్థిరమైన ఆలోచన కలిగి చేసే పనిలో శ్రద్ద బాగా పెరుగుతుంది. ఒకే మాట మీద నిలబడతారు. వీరు చేసే పనులను చూసి కొంత మంది నేర్చుకొనే స్థాయిలో ఏ రాశి వారు ఉంటారు. అయితే వీరికి ఎదుటి వారి పట్ల కొంత చులకన భావం ఉంటుంది.

దాంతో ఎదుటి వారు ఈ రాశివారికి గర్వం ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉంటె సరిపోతుంది. వీరు కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా ఉండటం అన్ని రకాలుగా మంచిది.

వృషభ రాశి
ఈ రాశివారికి దైవభక్తి కాస్త తక్కువే అని చెప్పాలి. వీరు దైవాన్ని నమ్మి నమ్మనట్టుగా ఉంటారు. వీరికి దైవ కార్యక్రమాలు చేయాలనీ మనస్సులో ఉన్నా బయటకు మాత్రం చేయాలా వద్దా అనే సంశయంలో ఉంటారు. దైవం విషయంలో వీరి ఆలోచన ఒక కొలిక్కి రాదు.

దైవం విషయంలో వీరి ఆలోచన 50- 50 గా ఉంటుంది. అయితే ఈ కార్తీక పౌర్ణమి నుండి వీరు గ్రహ స్థితుల కారణంగా దైవాన్ని నమ్ముతారు. అలాగే వీరికి ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ఆర్ధిక వ్యవహారాలు అన్ని చక్కబడతాయి.

వీరు పిల్లలకు వారి కలలను సాకారం చేసుకోవటానికి స్వేచ్ఛను ఇవ్వవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉంటేనే మంచిది. బాగా అలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి.

కార్తీక పౌర్ణమి వృషభ రాశిలో రావటం వలన వృషభ రాశివారికి ఎన్నో సానుకూల ప్రభావాలను చూపుతుంది. వీరు కార్తీక పౌర్ణమి నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే వీరి మీద ఎటువండి ఆర్థికపరమైన నియంత్రణలు ఉండవు. వీరి మీద ఇతరులకు నమ్మకం పెరుగుతుంది.

మిధున రాశి
ఈ రాశివారికి కార్తీక పౌర్ణమి నుండి ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పని చేయగలను అనే భావన కలుగుతుంది. ఈ రాశివారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీకు బంధువులు లేదా స్నేహితుల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఈ కార్తీక మాసం నుండి వాటిని పట్టించుకోవటం మానేస్తారు. మీరు చేసే ఆలోచనలపై ఎక్కువ నమ్మకం ఉంటుంది. కొత్తగా ఆలోచనలు వస్తాయి.

కర్కాటక రాశి
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు . వీరి గ్రహ స్థితుల కారణంగా వీరు ఈ కార్తీక పౌర్ణమి నుండి ఉక్కు మనిషిగా దృడంగా మారబోతున్నారు. వీరికి కష్టంగా ఉన్న పనులు అన్ని కార్తీక పౌర్ణమి నుండి చాలా సులభంగా ఉంటాయి. ఈ రాశి వారు ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో బాగా తెలిసి ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. కార్తీక పౌర్ణమి నుండి కర్కట రాశి వారికీ నూతన ఉత్తేజం కల్గుతుంది.

సింహ రాశి
సింహ రాశివారు ఇప్పటి వరకు చేయాలనీ అనుకున్న పనులు చేయకుండా ఉన్న పనులు అన్ని కార్తీకమాసం తర్వాత పూర్తీ అవుతాయి. ఇప్పటి వరకు ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవటానికి కాస్త వెనకడుగు వేసి ఉంటారు. కానీ ఇప్పటి నుండి వీరు ఎదుటి వారిని ఆదర్శంగా తీసుకోని ముందడుగు వేస్తారు.

సమస్య నుండి బయట పడటానికి పోరాటం చేస్తారు. వీరికి ప్రతి విషయంలోనూ ఒక స్పష్టమైన అవగాహనా ఉంటుంది. వీరు చేసే ప్రతి పని గురించి తన సన్నిహితులకు చెప్పి సలహా తీసుకోని మాత్రమే ముందడుగు వేస్తారు.