MoviesTollywood news in telugu

Brahmamudi:’బ్రహ్మముడి’ అపర్ణ గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు

BrahmaMudi Sripriya Unknown Facts: ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి విపరీతమైన పాపులారిటీ ఉంది. బుల్లితెరలో వచ్చే సీరియల్స్ లో నటించే నటీనటులకు ఎంతోమంది అభిమానులు ఉంటున్నారు. బ్రహ్మముడి సీరియల్ లో అపర్ణ పాత్రలో నటించిన శ్రీ ప్రియ గురించి తెలుసుకుందాం. బ్రహ్మముడి సీరియల్ లో శ్రీ ప్రియ హీరో రాజ్ కి తల్లిగా నటించింది.

అలాగే వైదేహి పరిణయం సీరియల్ లో కూడా శ్రీ ప్రియ నటిస్తుంది. రెండు సీరియల్స్ లోనూ ఈమెకు మంచి పేరు వచ్చింది. శ్రీ ప్రియ సొంత ఊరు విజయవాడ. చాలా సీరియల్స్, సినిమాలు చేసింది. సంధ్యారాగం సీరియల్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. పాప పుట్టాక కొంత గ్యాప్ తీసుకుని మరల మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంట్రీ వచ్చింది.

శ్రీ ప్రియ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు అయిపోయింది. శ్రీ ప్రియ భర్త శ్రీకర్ దర్శకుడుగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీ ప్రియ రెండు సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. బ్రహ్మముడి సీరియల్ లో ఇష్టం లేని కోడలిని తన మాటలతో ఇబ్బంది పెట్టే అత్తగా… మరోవైపు కొడుకు పై ప్రేమ చూపించే తల్లిగా రెండు వేరియేషన్స్ తో ఆకట్టుకొని ముందుకు సాగుతున్నారు.