Health Tips: చలికాలంలో ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం,గొంతు నొప్పి లేకుండా ఉండాలంటే..
Immunity Drink : మనలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్,ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం, జలుబు,వైరల్ ఇన్ ఫెక్షన్, దగ్గులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి కొంచెం కూలింగ్ వాటర్ తాగిన లేదా చల్లని పదార్థాలు తీసుకున్నా వెంటనే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. .ఇలా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తినాలన్నా తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది.
గొంతులో గర గర, గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించడానికి మనం ఈ రోజు ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ ఇంటిలో అందుబాటులో ఉండేవే.చేసుకోవటం కూడా చాలా సులువు.కాస్త ఓపిక ఉంటే సరిపోతుంది. ఈ చిట్కా పాటిస్తే ఎటువంటి మందుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు.
ఒక గిన్నెలో కచ్చా పచ్చాగా దంచిన 3 మిరియాలు, తిప్పతీగ కాడ చిన్న ముక్క,ఒక స్పూన్ అల్లం తురుము లేదా శొంఠి పొడి,6 తులసి ఆకులు ,మూడు లవంగాలు,ఒక స్పూన్ సొంపు, గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి మూడు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక తిప్పతీగ ఆకు వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ ఆర్గానిక్ బెల్లం వేసి ఒక నిమిషం మరిగించి పొయ్యి ఆఫ్ చేసి కాస్త చల్లారాక గ్లాసు లోకి వడకట్టాలి. ఈ డ్రింక్ ని అరగ్లాసు మోతాదులో ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే సరిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
మనం సాధ్యమైనంత వరకు సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవడం చాలా మంచిది. అవసరమైతే మందులు వేసుకోవటం తప్పదు. ఎక్కువగా మందులు వేసుకో కూడదు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగృడియన్స్ లోనూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


