Movies

Orange movie:అందరూ మెచ్చే క్లాసిక్ మూవీ ప్లాప్ అవ్వటానికి కారణాలు ఇవే..

Ram Charan Orange movie : ఒక్కోసారి అన్నీ బాగున్నా సరే,సినిమా డిజాస్టర్ అయిపోతుంది. దీనికి ఆడియన్స్ అభిరుచే కారణం. మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఆరెంజ్ మూవీ నవీన కథనం,మంచి స్క్రీన్ ప్లే,మంచి సంగీతం అన్నీ వున్నా సరే,దారుణంగా నష్టాలను మిగిల్చింది. క్లాసికల్ మూవీ కి స్టార్ ఇమేజ్ గా రామ్ చరణ్ ఉన్నాడు.

అయినా డిజాస్టర్ కావడం అంతుబట్టదు. దీనికి కారణాలు లోతుగా విశ్లేషిస్తే,అప్పటికే రెండో సినిమాగా మగధీర చేసిన రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. సౌత్ ఇండియాలో నెంబర్ 2 హిట్ గా నిల్చింది.దాంతో ఆతర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీపై భారీ అంచనాలు వచ్చేసాయి. అయితే మగధీరతో కనీసం సగం కూడా కమర్షియల్ విలువలు లేవు.

ఇదో క్లాసికల్ మూవీ కావడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫాన్స్ కి కూడా జీర్ణం కాలేదు. మూవీ బాగున్నా, ఇలాంటి మూవీని చెర్రీ నుంచి ఆశించలేదని ఫాన్స్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఫలితంగా నెగిటివ్ టాక్ విస్త్రంగా వైరల్ అయింది. ఇక 40కోట్ల బిజినెస్ జరగడంతో ప్రచారం భారీగా చేసారు.

అయితే ఇది ప్రేమను జోడించిన క్లాస్ మూవీగా ప్రచార పర్వంలో స్పష్టం చెప్పకపోవడం కూడా డిజాస్టర్ కి ప్రధాన కారణం. కంటెంట్ కి తగ్గట్టు ప్రచారం చేయలేకపోవడం నిర్మాతలు చేసిన పెద్ద తప్పు. ఇక బడ్జెట్ పరంగా సగానికి సగం తగ్గించి చేసే సినిమా. కానీ డబుల్ అయింది. దాంతో నష్టాల్లో కూరుకుపోవాల్సి వచ్చింది.

ఈ కథ విషయానికి వస్తే,2020లో రావాల్సిన సినిమా 2010లోనే వచ్చేసింది. కానీ ఆడియన్స్ ఆలోచన ధోరణిని అర్ధం చేసుకోకుండా అడ్వాన్సడ్ కథ కావడంతో రిసీవ్ చేసుకోలేకపోయారు. అప్పుడు బాగోలేని సినిమా ఇప్పుడు క్లాసిక్ అయిందంటే,దానికి కారణం రావాల్సిన సమయంలో రాకపోవడమే.