MoviesTollywood news in telugu

Tollywood:వికలాంగుల పాత్రలో హిట్ కొట్టిన మన హీరోలు

Tollywood Heroes :స్టార్ ఇమేజ్ గల పాత్రలో నటించడానికి ఇష్టపడతారే తప్ప దివ్యాంగులుగా నటించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించరు. ఫాన్స్ కూడా పెద్దగా అదర్శిస్తారన్న నమ్మకం కూడా వుండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే కొంతమంది దివ్యాంగులుగా నటించి మెప్పించిన, స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేసుకున్న స్టార్ హీరోలున్నారు.

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ గా పేరొందిన అక్కినేని నాగార్జున ఊపిరి మూవీలో దివ్యాంగుడిగా నటించి మెప్పించారు. కాళ్ళు చేతులు పడిపోయి, స్ట్రెచర్ కి పరిమితమైన పాత్రలో ఒదిగిపోయాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ చేసిన ఈ మూవీలో నాగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. మంచి విజయాన్ని కూడా నమోదుచేసుకుంది.

ఇక చిరుత మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం మూవీలో పాక్షికంగా చెవిటి పాత్రలో నటించి మెప్పించడమే కాదు, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో పల్లెటూరి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుత నటన కనబరిచాడు. మాస్ మహారాజుగా పేరొందిన రవితేజ విభిన్న పాత్రల్లో ఒదిగిపోవాలని కోరుకుంటాడు. రాజా ది గ్రేట్ మూవీలో అంధుడి పాత్రలో నటించి మెప్పించాడు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో రవితేజ నటనకు జనం జేజేలు పలికి, కాసుల వర్షం కురిపించారు. ఉయ్యాల జంపాల మూవీతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ విభిన్న పాత్రలు గల సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు పొందాడు. అంధగాడు సినిమాలో అంధుని పాత్రలో నటించి, మెప్పించాడు.

నేనెవరో మూవీలో ఆది పినిశెట్టి ద్విపాత్రాభినయం చేసాడు. అందులో ఒకటి బ్లైండ్ చెఫ్ గా, క్రైమ్ రిపోర్టర్ గా నటించి మెప్పించాడు. దివ్యాంగుల పాత్రల్లో గతంలో చాలా మంది నటించినా, ఈతరం హీరోలు కూడా చేయడం అభినందనీయం. అవి హిట్ కొట్టడం ప్రశంసనీయం.