Kitchenvantalu

Mini Masala Idli:ఇడ్లీ ఇష్టం లేని పిల్లలు కూడా ఈ విధంగా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు

Mini Masala idli Recipe: ఇడ్లీ ఇష్టం లేని పిల్లలు కూడా ఈ విధంగా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. మినీ మసాలా ఇడ్లీ.. పిల్లలకి స్నాక్స్ టేస్టీగా ఉంటే సరిపోదు. కాస్త ఇంట్రెస్టింగ్ గా కూడ ఉండాలి. అందుకే ఇడ్లీలను మాములుగా కాకుండా మసాలా ఇడ్లీ చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
ఇడ్లీలు – తగినన్ని
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
మినపప్పు – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్స్
మిరియాల పొడి – ½ టీ స్పూన్
మసాలా పొడి – 1 ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ఈ మసాలా ఇడ్లీల కోసం చిన్న సైజు ఇడ్లీ పాత్రను ఉపయోగించవచ్చు.లేదంటే ఇడ్లీలను ముక్కలుగా చేసి తయారు చేసుకోవచ్చు.
2.తయారు చేసుకున్న ఇడ్లీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3.స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు ,జీలకర్ర,శనగపప్పు,ఎండు మిర్చి వేసి వేపుకోవాలి.
4.పప్పులు వేగాక పసుపు,కరివుపాకు,కరివేపాకు పొడి ,ఇడ్లీ కారం పొడి లేదా సాంబార్ పొడి ఏదైనా మసాల వేసుకోవాలి.
5.తాలింపు వేగాక అందులోకి తయారు చేసుకున్న ఇడ్లీలను వేసుకోవాలి.
6.మసాలా తో బాగా మిక్స్ చేసుకోని కొత్తిమీర చల్లుకోని సర్వ్ చేసుకుంటే వెరైటీ మసాలా ఇడ్లీ రెడీ.