MoviesTollywood news in telugu

Chiranjeevi: ‘ఖైదీ’ సినిమాకి ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా?

Chiranjeevi Khaidi Movie details : చిరంజీవి సినిమా ఎప్పడు వస్తుందా అని ఎదురు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఖైదీ. ఈ మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు. అప్పటి వరకూ నటించిన సినిమాలు ఒక ఎత్తు, ఈ మూవీ మరో ఎత్తు అయింది. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో సంయుక్త మూవీ పతాకంపై నిర్మించిన ఈ మూవీ 1983అక్టోబర్ 28న రిలీజై బ్లాక్ బస్టర్ అయింది.

పరుచూరి బ్రదర్స్ కథ మాటలు అందించగా, మాధవి, సుమలత హీరోయిన్స్ గా నటించారు. రగులుతోంది మొగలి పొద సాంగ్ చిరంజీవి,మాధవిలపై చిత్రీకరించగా, డాన్స్ మాస్టర్లు సలీం, శివశంకర్ లు కంపోజ్ చేసారు. ఇక చక్రవర్తి మ్యూజిక్ అదరగొట్టేసింది. 20సెంటర్స్ లో 100రోజులు, 6సెంటర్స్ లో 200రోజులు ఆడింది. 20నుంచి 25లక్షలు మాత్రమే వెచ్చించి తీసిన ఈ మూవీ మూడు కోట్ల వరకూ వసూళ్లు రాబట్టిందని అంచనా.

ఖైదీ మూవీకి రెండు వారాల ముందు మోహన్ బాబు నటించిన కాలయముడు మూవీ వచ్చింది. ఎన్ హరిచంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేసాడు. అయితే ఈ మూవీ నిరాశ మిగిల్చింది. ఖైదీకి 8రోజుల ముందు చిరంజీవి నటించిన సింహపురి సింహం మూవీ వచ్చింది.

కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. అక్టోబర్ 21న నరేష్ నటించిన అగ్ని సమాధి మూవీ రిలీజయింది. కె ఎస్ ఆర్ దాస్, బండిరెడ్డి నరసింహారావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరాజయం పాలైంది. ఖైదీ రిలీజైన వారం తర్వాత బాపు డైరెక్షన్ లో మంత్రిగారి వియ్యకుండు మూవీ రిలీజయింది. ఓ పక్క ఖైదీ ఆడుతున్నా మరోపక్క ఈ మూవీ కూడా ఆకట్టుకుని ఆడియన్స్ ని రప్పించింది.

బాపు డైరెక్షన్ లో తొలి కమర్షియల్ మూవీగా దీన్ని చెప్పుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణ, జయసుధ జంటగా నటించిన లంకెబిందెలు మూవీ ఖైదీ ప్రభంజనం ముందు ప్లాప్ గా మిగిలింది. తర్వాత సుమన్ హీరోగా వచ్చిన చండీరాణి నవంబర్ 11న రిలీజయింది. పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ గా ఆడింది. తర్వాత వచ్చిన త్రివేణి సంగమం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సుమన్ నెగేటివ్ రోల్ చేసాడు.