Beauty Tips

White Hair:తెల్లజుట్టు నల్లగా మారటానికి కొన్ని చిట్కాలు…పైసా ఖర్చు లేకుండా..

White Hair Turn Black:ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనేది సర్వ సాదారణం అయిపొయింది.చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. ఒత్తిడి,మానసిక సమస్యలు జుట్టు తెల్లపడటానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ఇవే కాకుండా ఎక్కువ వేడి ఉన్న నీటితో తలస్నానం,అనంతరం జుట్టు అరబెట్టుకోవటానికి డ్రైయర్స్ ఉపయోగించటం,విటమిన్స్ లోపం, నీరసం, నిస్త్రానం,వాతావరణ కాలుష్యం,ధైరాయిడ్ లో అసమానతల వంటి కారణాలు జుట్టు తెల్లబడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం.

కొబ్బరి నూనె,నిమ్మ రసం రెండింటిని కలిపి మాడుకి ప్రతి రోజు రోజు పావుగంట మసాజ్ చేస్తే మంచి పలితం కనపడుతుంది. ఆహారంలో నువ్వులు ఉండేలా చూసుకోవాలి. అలాగే నువ్వుల నూనెను మాడుకు మసాజ్ చేయటం వాటివి క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమేపి నల్లగా మారే అవకాశం ఉంది.

పెరుగులో మెంతిపొడి కలిపి తల మొత్తం బాగా పట్టించి కొంతసేపు అయిన తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

జామ ఆకులను మెత్తగా రుబ్బి,దానిని తలకు బాగా పట్టించి బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఈ చిట్కా కూడా తెల్లజుట్టు నల్లగా మారటానికి దోహదం చేస్తుంది.

ఆవు నెయ్యిని మాడుకు రాసి మర్దనా చేయుట వలన కూడా మంచి పలితం కనపడుతుంది. క్యారట్ జ్యూస్ ను ప్రతి రోజు త్రాగటం వలన ఆరోగ్యంతో పాటు జుట్టుకి కూడా చాలా మంచిది. నిమ్మ ఆకులను రుబ్బి తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టును అరికట్టే శక్తి నిమ్మ ఆకులకు ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.