Kitchenvantalu

Copper Bottle Cleaning :ఇలా చేస్తే రాగి (కాపర్ ) బాటిల్స్ నిమిషంలో శుభ్రం అవుతాయి…చాలా సింపుల్…

Copper Bottle Cleaning Tips:ఈ మధ్యకాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి రాగి పాత్రలో నీటిని తాగటం అలవాటు చేసుకున్నారు. ఈ మధ్య రాగి బాటిల్స్ వాడకం చాలా ఎక్కువైంది. రాత్రంతా ఈ బాటిల్లో నిల్వ ఉంచిన నీటిని తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుపుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

రాగి బాటిల్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన గాలిలో ఆక్సిజన్ తో చర్య జరిపి అవి రంగు మారిపోవటం, బాటిల్ అడుగున ఆకుపచ్చగా మారటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

వెనిగర్ లో ఉప్పు కలిపి పేస్ట్ లా తయారు చేసి బాటిల్ ఉపరితలంపై రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేయాలి. ఉప్పు వెనిగర్ రెండింటిని నీటిలో కలిపి ఆ నీటిని బాటిల్లో పోసి బాటిల్ లోపలి బాగం శుభ్రం చేయాలి.

నిమ్మ లో ఉన్న ఆమ్లా గుణాలు కాపర్ బాటిల్ శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయను సగాన్ని కట్ చేసి బాటిల్ పై భాగాన్ని రుద్దాలి. నిమ్మ రసాన్ని నీటిలో కలిపి బాటిల్లో పోసి బ్రష్ సాయంతో క్లీన్ చేయవచ్చు. కాపర్ బాటిల్లో కాస్త వేడిగా ఉన్న నీటిని పోసి దానిలో కొంచెం ఉప్పు, రెండు నిమ్మ చెక్కలు, కాస్త వెనిగర్ వేసి ఆర గంటపాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.