Kitchenvantalu

Egg Paratha:ఇది ప్రోటీన్లతో నిండిన బ్రేక్‌ఫాస్ట్.. టేస్ట్‌లోనూ బెస్ట్!

Egg Paratha:ఎగ్ పరాటా.. ఆరోగ్యకరమైనా పరాటను మరింత హెల్తీగా ఉడికించిన ఎగ్ తో చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 2 కప్పులు
ఉడికించిన గుడ్లు – 4
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – ½ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీస్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
గరంమాసాలా – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.గోధుమ పిండిలోకి ఉప్పు,కొద్దిగా నూనె వేసి చపాతి పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి.
2.కలుపుకున్న పిండిని అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి.
3.ఇప్పుడు ఉడికించిన గుడ్లను తురుముకోని మెత్తగా చేసుకోవాలి.
4.అందులోకి పచ్చిమిర్చి ,కొత్తిమీర ,ఉప్పు,కారం ,ధనియాల పొడి,గరం మసాలా,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
5.కలిపి పెట్టుకున్న పిండిని పూరీల చేసుకోని అందులోకి కొద్దిగా స్టఫ్ ని పెట్టుకోని ఎడ్జస్ ని క్లోజ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు స్టఫ్ బయటకు రాకుండా పరాటాలను నెమ్మదిగా తాల్చుకోవాలి.
7.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడెక్కని పెనం పై పరాటాలను జాగ్రత్తగా వేసుకోవాలి.
8.మీడియం మంట పై వేపుకోవలి.
9.కరిగించిన బటర్ వేసి రెండు వైపులా కాల్చుకుంటే టేస్టీ టేస్టీ గుడ్డు పరాటా రెడీ.