MoviesTollywood news in telugu

Rana: విరాటపర్వం సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Rana virata parvam Movie :బాహుబలితో నెగెటివ్ రోల్ లో సైతం సూపర్ గా మెప్పించిన యంగ్ హీరో రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమా 1990లోని నక్సలైట్ల జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌ గా నటించింది. ఇందులో నందితా దాస్, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. వేగంగా వైరల్ కూడా అవుతోంది. అదేమిటంటే, నిజానికి ఈ సినిమా లో హీరోగా తొలుత మ్యాచో స్టార్ గోపీచంద్‌ను డైరెక్టర్ సంప్రదించినట్లు టాక్. అయితే ఆ సమయంలో గోపీచంద్ వరుసగా సినిమాలు చేస్తుండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో విరాటపర్వం చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట.

ఇక ఎంత మాత్రం లేట్ చేయకుండా వేణు ఉడుగుల సురేష్ ప్రొడక్షన్స్‌కు సంప్రదించగా, రానా హీరోగా ఒకే చేయడంతో సినిమా స్టార్ట్ చేసేసారు.మొత్తానికి వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపీచంద్ ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేసుంటే బాగుండేది అని పలువురు అంటున్నారు. అయితే గోపీచంద్ ఈ సినిమా చేస్తే, ఇప్పుడున్న క్రేజ్ ఉండకపోయేదని కూడా మరికొందరు అనేమాట.