MoviesTollywood news in telugu

Rashi Khanna:రాశి ఖన్నా మిస్ అయిన సూపర్ హిట్ సినిమాలు…ఎన్ని ఉన్నాయో…?

Rashi Khanna Movies: ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా… ఆ తర్వాత సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఆమె కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నది. ఆ సినిమాలు చేసి ఉంటే ఆమె కెరీర్ ఊహించని రేంజ్ లో ఉండేది.

బాహుబలి తమన్నా క్యారెక్టర్ ముందుగా రాశి ఖన్నా దగ్గరకు వచ్చింది. అయితే ఆ రోల్ కు అడిషన్ ఇచ్చిన రాశీఖన్నా సినిమాలోని కొన్ని సన్నివేశాలకు ఆమె సెట్ కాదని… ఊహలు గుసగుసలాడే సినిమాకు రికమెండ్ చేశారంట.దర్శకుడు పరశురామ్ సర్కార్ వారి పాట సినిమాలో అవకాశం ఇద్దామని అనుకుంటే… నిర్మాతలు కీర్తి సురేష్ ని సెలక్ట్ చేసారు.

శింబు హీరోగా వచ్చిన మానాడు సినిమాలో ముందుగా రాశీ ఖన్నా నే హీరోయిన్ గా అనుకున్నారు, కానీ ఆ తరువాత ఆ ఛాన్స్ కళ్యాణి ప్రియదర్శన్ కి దక్కింది. ఎఫ్ 2 సినిమా లో హనీ క్యారెక్టర్ కి ముందుగా అనిల్ రావిపూడి రాశి ఖన్నాని సంప్రదించాడు. అయితే ఆమె నో చెప్పటంతో ఆ పాత్ర మెహరీన్ కి దక్కింది. గీత గోవిందం సినిమాలో కూడా ముందుగా రాశి ఖన్నాకే చాన్స్ వచ్చింది. అయితే ఆమె రెజెక్ట్ చేయటంతో ఆ అవకాశం రష్మిక మందాన ని వరించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."