Healthhealth tips in telugu

Jamun Leaves Benefits:ఈ ఆకు గురించి అందరికి తెలుసు… కానీ ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Neredu Leaves Benefits in telugu : మన చుట్టుపక్కల ఉండే మొక్కలలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం. వాటిలో ఉన్న ప్రయోజనాలు,పోషకాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి మొక్కలలో ఒకటైన నేరేడు గురించి తెలుసుకుందాం.
Neredu Leaves Benefits in telugu
మిర్టేసి కుటుంబానికి చెందిన నేరేడు చెట్టులో ఆకూ,కాయలు,బెరడు ఇలా అన్ని మన ఆరోగ్యానికి సహాయం చేసేవే. నేరేడు చెట్టు వంద సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఈ రోజు మనం నేరేడు ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మరియు నేరేడు ఆకును ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం. నేరేడు ఆకుల పేస్ట్ తో పళ్ళను తోముకుంటే దంతాలు బలంగా దృడంగా తయారవుతాయి.
Mouth ulcer Home Remedies
నేరేడు ఆకుల కషాయాన్ని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే నోటిలో పుండ్లు తగ్గుతాయి. నేరేడు ఆకులు, మామిడి ఆకులతో కషాయాన్ని తయారుచేసి దానిలో తేనే కలిపి త్రాగితే పైత్యం వల్ల వచ్చే వాంతులు తగ్గుతాయి. నేరేడు ఆకుల కషాయాన్ని తీసుకోవటం వలన బ్యాక్టీరియా,వైరస్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఒక నేరేడు ఆకును నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది.

నేరేడు ఆకుల రసంలో పసుపు వేసి పురుగు కుట్టిన ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే దద్దుర్లు, రాష్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించటంలో నేరేడు ఆకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నేరేడు పండ్లే కాకుండా నేరేడు ఆకులు కూడా మధుమేహంను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
Diabetes diet in telugu
నేరేడు ఆకులను ఎండబెట్టి కాల్చి పొడిగా చేయాలి. ఈ పొడిని కొబ్బరినూనెలో కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
ఈ ఆకులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, మలబద్ధకానికి చికిత్స మరియు అలెర్జీని తొలగించడంలో కూడా చాలా సమర్ధవంతంగా సహాయపడుతుంది.
kidney problems
నేరేడు ఆకుల నుండి తయారుచేసిన నూనెను పెర్ఫ్యూమ్ తయారీ మరియు సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. నేరేడు ఆకులు విరేచనాల నివారణకు సహాయపడతాయి.శరీరంపై ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ దాడి చేయకుండా చేస్తుంది. 10 గ్రాముల నేరేడు ఆకులతో తయారుచేసిన రసంలో కొంచెం నల్ల మిరియాల పొడి వేసి త్రాగితే కిడ్నీలో రాళ్లు కరగటమే కాకుండా రాళ్ళూ ఏర్పడకుండా కాపాడుతుంది.

ఈ రసాన్ని రోజులో రెండు సార్లు త్రాగితే ప్రయోజనం కలుగుతుంది. నేరేడు ఆకులో క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన క్యాన్సర్ కణాల మీద పోరాటం చేస్తుంది. శరీరం యొక్క సెల్ కణజాలం నష్టాన్ని తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నేరేడు ఆకుల కషాయాన్ని త్రాగితే తొందరగా జ్వరం తీవ్రత తగ్గుతుంది. శరీరం మొత్తం రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రోత్సహించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
gas troble home remedies
ఎక్కువగా మసాలా ఆహారాలను తీసుకున్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని తగ్గించటంలో నేరేడు ఆకులు బాగా పనిచేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు నేరేడు ఆకును వాడితే రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే సమ్మేళనాలు నేరేడు ఆకులలో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.