Vegetable Bread Rolls:యమ్మీ యమ్మీ వెజ్ రోల్స్ ని హెల్దీగా ఇలా చేయండి.. మొత్తం లాగించేస్తారు
Vegetable Bread Rolls:బ్రెడ్ రోల్స్..ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు బ్రేక్ ఫాస్ట్,స్నాక్స్ ఉన్నట్టే. బ్రెడ్ కాంబినేషన్లో వెజిటెబుల్స్ రోల్స్ చేసి చూడండి చాలా బాగుంటాయి.
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ ముక్కలు – 4
వెజిటెబుల్స్ –నచ్చినవి
ఉల్లిపాయలు – 1
చీజ్ – 2 స్లైస్
ఉప్పు – రుచికి సరిపడా
మిరయాల పొడి – 1 టీస్పూన్
గుడ్లు – 2
మైదా – 1 టీ స్పూన్
సాస్ – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేడి చేసి తరిగిన కూరగాయ ముక్కలను వేసి విడివిడిగా వేపి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లను కొట్టి సోన తీసుకోవాలి.
3.బ్రెడ్ ముక్కలను అంచులు కత్తిరించుకోవాలి.
4.బ్రెడ్ ముక్కలను రొట్టెల కర్ర సాయంతో వత్తుకోవాలి.
5.మిక్సింగ్ బౌల్ లో మైదా వేసి రెండు స్పూన్ల నీళ్లను వేసి కలుపుకోవాలి.
6.అందులోకి మిరియాల పొడి,ఉప్పు వేసి కలుపుకోవాలి.
7.బ్రెడ్ మీద సాస్ వేసి దాని పై వేపుకున్న కూరగాయలను వేసి,ఆపై చీజ్ చల్లుకోని ,ఉప్పును కూడ వేసుకోవాలి.
8.బ్రెడ్ కి ఒక చివర మైదా పేస్ట్ ని పూసి రోల్ చేసి చివర్లో అంటిచ్చండి.
9.ఇలా చేసుకున్న రోల్స్ ని గుడ్డులో ముంచి బ్రెడ్ పొడిలో కోట్ చేసుకోవాలి.
10.ప్యాన్ పై రెండు,మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేసి తయారు చేసుకున్న రోల్స్ ని వేయించుకోవాలి.


