Kitchenvantalu

Capsicum Curry:కాప్సికమ్ మసాలా కర్రీ రుచిగా ఇలా చేయండి.. రైస్, చపాతీ, పులావ్ లో సూపర్ గా ఉంటుంది

Capsicum Curry:క్యాప్సికం మసాలా కర్రీ.. క్యాప్సికం తో మసాలా గ్రేవి కర్రీ చేస్తే స్పెషల్ బిర్యానీలోకి చపాతి,పుల్కాలోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
క్యాప్సికం – ¼ kg
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 2
టమోటాలు – 2
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు -2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
మెంతులు – ¼ స్పూన్స్
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – 2 స్పూన్స్
కారం – 2 టీ స్పూన్స్
చింతపండు – 10 గ్రాములు
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా మసాలా కోసం ప్యాన్ వేడి చేసి పల్లీలు,ధనియాలు,జీలకర్ర,మెంతులు,నువ్వులు,కొబ్బరి పొడి వేసి వేపుకోవాలి.
2.వేపుకున్న మసాలా దినుసులను పక్కన పెట్టుకోని చల్లారనివ్వాలి.
3.అదే ప్యాన్ లోకి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4.ఇప్పుడు మిక్సి జార్ లోకి ముందుగా వేపుకున్న మసాలా దినుసులను, వేసి చింతపండు వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

5.ఉల్లిపాయలు వేగాక అందులోకి పచ్చిమిర్చి,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్,టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి.
6.ఇప్పుడు క్యాప్సికం ముక్కలువేసి మూత వేసి ఐదు నిమిషాల పాట ఫ్రై చేసుకోవాలి.
7.క్యాప్సికం మెత్తపడ్డాక కారం,ఉప్పు,గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి నిమిషం పాటు వేపుకోని తగినన్ని నీళ్లు కలుపుకోవాలి.
8.గ్రేవి ఉడకి నూనె తేలే వరకు ఉడికించి గరం మసాలా వేసి చిక్కపడనివ్వాలి.
9.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాప్సికం మసాలా కర్రీ రెడీ.