Egg Tomato Curry:టమాటో ఎగ్ కర్రీని ఇలా రుచిగా చేయండి.. రైస్ లో చాలా బావుంటుంది
Egg Tomato Curry:ఎగ్ టమాటో కర్రీ.. ఈజీగా చిటికెలో తయారు చేసుకునే టేస్టీ కర్రీస్ లో టమాటో ఎగ్ కర్రీ ఒకటి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు,టేస్టీ ,టేస్టీగా స్పైసీ స్పైసీ గా ఎగ్ టమాటో తో ఇలా చేసుకోండి.
కావాల్సిన పదార్ధాలు
టమాటోలు – ¼ kg
స్ప్రింగ్ ఆనియన్స్ – 1 కప్పు
ఆనియన్స్ – 1
కారం – 2 టీ స్పూన్స్
ఉప్పు – ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
నువ్వుల పొడి – 1 ½ టీ స్పూన్
జీలకర్ర మెంతుల పొడి – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
పసుపు – ½ టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
గుడ్లు – 2
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని అందులోకి నూనే వేడి చేసి ఉల్లిపాయ తరుగు , వేసి ఫ్రై చేసుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
4.అందులోకి టొమాటో ముక్కలను వేసి మెత్త పడే వరుకు వేయించుకోవాలి.
5.టమాటో మెత్తపడ్డాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేపుకోవాలి.
6.ఇప్పుడు కారం,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్ర మెంతుల పొడి,నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి.
7.కొద్దిగా నీళ్లను వేసి మూడు,నాలుగు నిమిషాలు ఉడికించాలి.
8.ఇప్పుడు అందులోకి టమాటోలను పక్కకు జరుపుకోని గుడ్లను కొట్టి వేసుకోవాలి.
9.గుడ్డను కదిలించకుండా మూత వేసి ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి.
10.ఇప్పుడు గుడ్లు ఉడికాక నెమ్మదిగా కలుపుకోవాలి.
11.ఇప్పుడు గరం మాసాల వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ టమాటో కర్రీ రెడీ.


