MoviesTollywood news in telugu

Sneha ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయో తెలుసా?

Tollywood Heroine Sneha marriage : అభిమాన హీరోయిన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ పెళ్లి తర్వాత ఇప్పుడు వదిన పాత్రల్లో అందంగా ఒదిగిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తోంది.

అయితే టాలీవుడ్ లో గతంలో హీరోయిన్ గా చేసి, పెళ్లి తర్వాత మరల రీ ఎంట్రీ ఇచ్చింది. స్నేహ తొలివలపు మూవీతో గోపీచంద్ సరసన నటించి వెంకీ, రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు,రాజన్న,ఉలవచారు బిర్యానీ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబయిలో పుట్టిన స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. సినిమాల్లోకి వచ్చే ముందు పేరు మార్చుకుంది.

కొంతకాలం దుబాయ్ లో ఉన్నాక చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇంటర్ పూర్తయ్యాక సినీ రంగంపై గల ఆసక్తితో మళయాళ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చి,అనతికాలంలోనే పలు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది. ఇటీవల అలీతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్నేహ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

స్నేహకు తమిళ నటుడు ప్రసన్న తో 2012లో మే11న పెళ్లయింది. తాను ప్రేమించిన ప్రసన్నకు, తనకు మొదట్లో గొడవ వచ్చిందని, ప్రసన్నకు తనపై కోపంగా ఉండేదని స్నేహ ఓ ఇంటర్యూలో చెప్పింది.ఎందుకంటే ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో ప్రసన్న పక్కన నటించనని చెప్పడంతో కోపగించుకున్నాడట. ఇక ఆతర్వాత ప్రేమలో పడ్డారు.

అచ్చం ముందు చిత్రం ద్వారా ప్రసన్నతో నటించడంతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. ఇరువైపులా పెద్దల గ్రీన్ సిగ్నల్ తో ఈ పెళ్లి జరిగింది. నిజానికి వీరి ప్రేమ పెళ్ళికి స్నేహ పేరెంట్స్ త్వరగానే కన్వెన్స్ అయినప్పటికీ నటుడు ప్రసన్న పేరెంట్స్ ససేమిరా అన్నారు.

ఏడాదిపాటు ఎంతచెప్పినా వినకపోవడంతో అనేక సమస్యలు వచ్చాయట. స్నేహను ఏమాత్రం ఒప్పుకొని ప్రసన్న పేరెంట్స్ అనేకసార్లు గొడవకు దిగారట. ఎట్టకేలకు ఒప్పుకోవడంతో అందరూ ఒకటయ్యారు.