MoviesTollywood news in telugu

Tollywood:ఈ సింగర్స్ సినిమాల్లో కూడా నటించారని మీకు తెలుసా.?

Tollywood Famous Singers In Movies :సినిమా గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తూ ఉంటారు. తెర వెనుక ప్లే బ్యాక్ సింగర్స్ గా రాణిస్తూ హీరో, హీరోయిన్స్ పాడుతున్నట్లే భ్రమ కల్పించే సింగర్స్ లో సినిమాల్లో కూడా నటించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారి వివరాల్లోకి వెళ్తే, శ్రీ వేంకటేశ్వర మహత్యంలో అలనాటి మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాట పాడుతూ కన్పిస్తారు. అప్పట్లో వింతగా చెపుకునే వారు.

నటిగా,దర్శకురాలిగానే కాకుండా గాయనిగా కూడా సినిమాల్లో తన పాటలు తానే పాడుకునే భానుమతి అప్పటి అగ్ర హీరోల సరసన నటించారు. క్యారెక్టర్ యాక్టర్ గా,బామ్మగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం నటించి,తన గీతాలు తానే పడుకున్నారు.

ఇక గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అయితే సినిమా నటుడిగా మెయిన్ రోల్ పోషించడమే కాకుండా, తెలుగు,తమిళ భాషల్లో పలు చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా చేసి,ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ప్రేమికుడు,పవిత్ర బంధం,మిధునం వంటి ఎన్నో చిత్రాల్లో బాలు నటించారు. గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్టు మనో కూడా సినిమాల్లో నటించారు. శివమ్ సినిమాలో రాశీఖన్నా తండ్రిగా నటించారు.

సింగర్ శ్రీరామచంద్ర ఎన్నో సినిమాల్లో సాంగ్స్ పాడడమే కాదు ఓ సినిమాలో హీరోగా చేసాడు. సింగర్ సందీప్ ప్రేమాయనమః,ఇంకోసారి మూవీస్ తో పాటు సందీప్ కిషన్ హీరోగా చేసిన సినిమాలో నటించారు. గాయని ఆండ్రియా తెలుగులో తడాఖా మూవీగా,తమిళ మూవీలో కూడా నటించింది.

రుద్రమదేవి మూవీలో గాయకుడు బాబా సెహగల్ నటించగా; ఈగ, కుమారి 21ఎఫ్,నాన్నకు ప్రేమతో మూవీస్ లో సింగర్ నోయల్ నటించారు. సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేది మూవీలో స్పెషల్ గెస్ట్ గా నటిస్తే, మరో సంగీత దర్శకుడు థమన్ బాయ్స్ మూవీలో కీలక పాత్రలో నటించారు.

ఇంకో సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ 100%లవ్ తమిళ్ రీమేక్ లో హీరోగా నటించగా,అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్ గా చేసింది. ఇంకో సంగీత దర్శకుడు రఘు కుంచె బాచి, హోలీ, పలాస మూవీస్ లో నటించారు. ఇక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్,సింగర్ హిమేష్ రేషిమ్మియా హీరోగా అనేక ముఖ్య పాత్రల్లో నటించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."