Healthhealth tips in telugu

Sesame seeds with honey:నువ్వులు, తేనె కలిపి తీసుకుంటే…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…

Sesame seeds with honey Benefits :నువ్వులు, తేనె రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా నువ్వులతో ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. నువ్వులు, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

నువ్వులలో ఐరన్, పొటాషియం మెగ్నీషియం, జింక్, కాల్షియం, థయామిన్, విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా 6 ఫ్యాటి యాసిడ్స్, ప్రోటీన్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న నువ్వులలో తేనెను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ తేనె, 2 స్పూన్ల నువ్వులను కలిపి ఉదయం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి లభించి నీరసం, అలసట వంటివి లేకుండా రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నువ్వులు తేనె కలిపి తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అలాగే తినాలనే .కోరిక తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతి రోజు తింటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

మెదడు చురుగ్గా పని చేసి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమంలో కొంచెం శొంఠి పొడి కలిపి తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. జుట్టు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.