Unstoppable With NBK Episode 3: అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ గెస్టులు ఎవరో తెలుసా..?
Unstoppable With NBK Episode 3: అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ గెస్టులు ఎవరో ఆహా రివీల్ చేసింది. ఓటీటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే తో బాలయ్య బాబు ఒక మంచి ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.
తనకు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మరో పక్క ఓటీటీ షో లో అభిమానులను అలరిస్తున్నాడు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లో మూడో ఎపిసోడ్ లో శ్రియ శరణ్, సుహాసిని మణిరత్నం, జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ వస్తున్నారు.
ఈ కాంబినేషన్ చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యి.. ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. అలా ప్రతి ఎపిసోడ్ అభిమానుల్లో ఆసక్తిని కలిగించేలా డిజైన్ చేస్తున్నారు.
అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ తొలి రెండు ఎపిసోడ్లు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. తొలి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీమ్ నుంచి అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల వచ్చారు. ఇక ఈ మధ్యే యానిమల్ టీమ్ తమ మూవీని ఈ షో ద్వారా ప్రమోట్ చేసింది. దీనికి రణ్‌బీర్ కపూర్, రష్మికతోపాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా వచ్చాడు.


