Pongal Recipe:గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం కట్టెపొంగలి.. రుచి అద్భుతంగా ఉంటుంది..
Pongal Recipe:పొంగల్ రెసిపీ.. పూజలకు పండలకు నైవేథ్యాలకు, స్పెషల్ ప్రసాదం పొంగల్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
పచ్చి శనగలు – 1/2కప్పు
ఎండుమిర్చి -2
జీలకర్ర – 1 టీ స్పూన్
మిరియాలు – 1 టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
జీడిపప్పులు – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా బియ్యం , పచ్చిశనగలను శుభ్రంగా కడిగినాన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లోకి, మరిగించిన నెయ్యి వేసి, వేడి చేసుకుని, జీలకర్ర, ఎండుమిర్చి, తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేపుకోవాలి.
3.అందులోకి మిరియాల పొడి, జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4.జీడిపప్పులు వేగిన తర్వాత, ముందుగా నానపెట్టుకున్న, బియ్యం , శనగలను వేసి, ఒక కప్పు బియ్యం కోసం మూడు కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని, కుక్కర్ మూత పెట్టి, మూడు విజిల్సి వచ్చే వరకు ఉడికించాలి.
5. ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి, మిక్స్ చేసుకుని పొంగల్ను సెర్వ్ చేసుకోవడమే.


