Rava Laddu:రవ్వ లడ్డుని ఈ కొలతలతో చేయండి.. మంచి టేస్టీగా ఉంటాయి
Rava Laddu;రవ్వ లడ్డులు..తెలుగు వారి ఫేవరేట్ స్వీట్స్ లో రవ్వ లడ్డు ఒకటి. చిన్నపాటి అకేషన్స్ కి ఈజీగా చిటికెలో తయారు చేసుకునే తెలుగు వారి సంప్రాదాయ వంటకం రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
ఉప్మా రవ్వ – ¼ kg
చక్కెర – ¼ kg
కొబ్బరి పొడి – ½ కప్పు
జీడిపప్పు – తగినన్ని
యాలకుల పొడి – ½ టీ స్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లోకి ఉప్మా రవ్వను వేసి మాడిపోకుండా వేపుకోవాలి.
3.కాస్తా రంగు మారాకా కొబ్బరిపొడిని కూడ యాడ్ చేసి వేపుకోని వేరొక గిన్నెలోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి.
4.ఇప్పుడు ప్యాన్ లో చక్కెర లోకి,అర కప్పు నీళ్లను వేసి కరిగిస్తు పాకం అయ్యే వరకు కలుపుతు ఉండాలి.
5.పాకం రెడీ అయ్యాక అందులోకి యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్,వేపుకున్న రవ్వను వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.మిశ్రమం కాస్తా చల్లారక లడ్డులుగా చుట్టుకుంటే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ.


