Chiranjeevi ఎత్తుకున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోని గుర్తు పట్టారా…?
Tollywood Star hero: హీరో లేదా హీరోయిన్ గురించి ఏ విషయం తెలిసిన చాలా ఆనందం కలుగుతుంది. పాత ఫోటోలు చాలా అపురూపంగా ఉంటాయి. అందునా మెగాస్టార్ లాంటి వాళ్ళతో ఉండే ఫొటోస్ అంటే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆనాటి పెద్దలు దివంగతులవ్వడంతో ఇప్పుడు అందరికీ మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కు.
అందుకే లాక్ డౌన్ వేళ పెద్దరికం వహించి, విరాళాలు పోగుచేసి సినిమా కార్మికుల కడుపు నింపాడు. అంతేకాదు ఇండస్ట్రీలో హీరోలందరికీ గురువు అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అందరికీ రోల్ మోడల్. ఇంట్లో హీరోలున్నా కూడా చిరంజీవినే తమ రోల్ మోడల్‌గా కొందరు హీరోలు చెప్తుంటారు. చిరులా డాన్సులు చేయాలి.. ఆయన మాదిరే మాస్ ప్రేక్షకులకు చేరువవ్వాలి.. ఫైట్స్ చేయాలని ఇప్పటి తరం హీరోల కల.
అలాంటి చిరంజీవి చేతుల మీదుగా దండ వేయించుకుని.. షీల్డు కూడా అందుకున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు. అయితే అతనెవరో గుర్తు పట్టగలరా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో అతడు కూడా హీరోనే. పైగా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారసుడు.అతనెవరో కాదు.. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది. తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని ఆది ఫేస్ బుక్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
అందులో చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వైరల్ అయింది. నిజానికి ఆది నటించిన తొలి సినిమా ‘ప్రేమ కావాలి’ సమయంలో కూడా చిరంజీవి ప్రమోషన్ చేసాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే కన్నడలోకి కూడా వెళ్లాలని చూస్తున్నాడు ఆది. ఇక ఈ ఫోటో అప్పట్లో చంద్రమోహన్, జయసుధ జంటగా సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన కలికాలం సినిమా సమయంలో సీన్ అన్నమాట.
ఈ మూవీ లో సాయికుమార్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా వంద రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేడుకలో సాయికుమార్ షీల్డ్‌ను ఆయన కొడుకు ఆదికి చిరంజీవి అందించాడు. ఈ అరుదైన ఫొటోను ఆది తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి ఫ్యాన్స్‌తో పంచుకోవడంతో తెగ హల్చల్ చేస్తోంది.


