MoviesTollywood news in telugu

Tollywood Heroines:మొదటి సినిమాతో హిట్ కొట్టి మాయం అయిన భామలు

Tollywood actress: సినీ పరిశ్రమలో అవకాశాలు రావటమే చాలా కష్టం. సినిమా ప్రపంచంలో అవకాశం రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. విజయం వచ్చిందంటే వరుస అవకాశాలు క్యూ కడతాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతో విజయం వచ్చిన ఆ తర్వాత అర కోర సినిమాలు చేసి మాయం అయ్యిపోయారు. వారి గురించి తెలుసుకుందాం.
షామిలి 
బాలనటిగా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత ‘ఓయ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరల సినిమాల్లో కనపడలేదు. కార్తీక 
అలనాటి నటీమణి రాధ కూతురిగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘దమ్ము’ సినిమా చేసిన ఆ తర్వాత టీవీ రంగానికి వెళ్ళింది. 
సియా గౌతమ్ 
పూరీ జగన్నాద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘నేనింతే’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వేదం సినిమాలో కనిపించిన ఆ తర్వాత మరెక్కడా కనపడలేదు. 
నేహా శర్మ 
రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత ఛాన్స్ లు వచ్చిన నిలబెట్టుకోలేక చతికలపడింది. 

మీరా చోప్రా 
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా పరాజయం కావటంతో ఐరన్ లెగ్ పేరుతొ పక్కన పెట్టేసారు. 
గౌరీ ముంజల్ 
బన్నీ సినిమాలో అల్లు అర్జున్ తో ఆడి పాడింది. అయినా ఈ అమ్మడు ముందుకు వెళ్లలేకపోయింది. 
బాను శ్రీ మెహ్రా 
వరుడు లో హీరోయిన్ గా నటించిన బాను శ్రీ మెహ్రా ను సినిమా విడుదల అయ్యే వరకు రివీల్ చేయలేదు. సినిమా విడుదల అయ్యాక ఎవరు చూడలేకపోయారు. 

అనురాధ మెహతా

అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. ఇందులో ఆర్య లవర్ గీతగా మెప్పించిన అనురాధ మెహతా తర్వాత కనిపించలేదు.
అన్షు
అన్షు మన్మథుడు సినిమాలో కొంచెం సేపు కనిపించినప్పటికీ అన్షు అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించింది. ఆ తర్వాత కనబడకుండా పోయింది.

రిచా 
‘నువ్వే కావాలి’ అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రిచా రెండు మూడు సినిమాలతో కనుమరుగు అయ్యిపోయింది.