Guess This Actress:చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?
Tollywood Heroine nivetha thomas : సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ కావడం ఈ మధ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా నివేదా థామస్ చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు గ్లామర్ పాత్రల కన్నా నటనకు స్కోప్ గల పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తోంది.
తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తున్న ఈమె వేరుతే ఒరు భార్య అనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక కురువి అనే తమిళ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మాన్ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయం అయింది.
తొలిసినిమాతోనే ఆడియన్స్ మనసు దోచిన ఈ చెన్నై భామ ఎక్కువగానే ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. నిన్ను కోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి వంటి సినిమాల్లో నటించిన నివేదా ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత మీట్ క్యూట్, శాకిని డాకిని మూవీస్ లో నటించింది. చిన్నప్పటి ఫోటో చూసి సో క్యూట్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


