MoviesTollywood news in telugu

Guess This Actress:చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?

Tollywood Heroine nivetha thomas : సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ కావడం ఈ మధ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా నివేదా థామస్ చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు గ్లామర్ పాత్రల కన్నా నటనకు స్కోప్ గల పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తోంది.

తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తున్న ఈమె వేరుతే ఒరు భార్య అనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక కురువి అనే తమిళ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మాన్ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయం అయింది.

తొలిసినిమాతోనే ఆడియన్స్ మనసు దోచిన ఈ చెన్నై భామ ఎక్కువగానే ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. నిన్ను కోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి వంటి సినిమాల్లో నటించిన నివేదా ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత మీట్ క్యూట్, శాకిని డాకిని మూవీస్ లో నటించింది. చిన్నప్పటి ఫోటో చూసి సో క్యూట్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."