Healthhealth tips in telugu

Weight Loss Soup:ఈ జావ తాగితే..బరువు తగ్గటం పక్కా..మరెన్నో ప్రయోజనాలు

Barli Weight Loss Home remedies In telugu : ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు రావటం అయితే చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పట్టేస్తుంది. అయితే ఏ సమస్య అయినా ప్రారంభంలో ఉంటే మాత్రం కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ రోజు బార్లీ జావ గురించి తెలుసుకుందాం.

దీని కోసం మనం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. మూడు మనకు ఇంటిలో అందుబాటులో ఉండేవే. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు బార్లీ గింజలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగించాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ పొడి వేసి జావ కాయాలి. ఈ జావను ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగాలి. ఆ తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరల పది రోజులు తాగాలి. ఈ జావ తాగితే తక్షణ శక్తి వస్తుంది. బార్లీలోని మాంగనీస్ నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది.

అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అమైనో ఆమ్లాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి కూడా బాగా సహాయపడుతుంది.

డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా నీరసం,అలసట లేకుండా చేస్తుంది. రోజంతా ఉషారుగా ఉంటారు. చెడు కొలెస్ట్రాల్ సమస్య లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.