MoviesTollywood news in telugu

ఆర్య సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

లెక్కలు మాస్టారుగా చేస్తూ,సినిమాలపై మోజుతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మనసిచ్చి చూడు,హనుమాన్ జంక్షన్,క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఈమూడు మూవీస్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. ఇక డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉంది. వైజాగ్ బీచ్ లో సుకుమార్,ప్రకాష్, వేమారెడ్డి లతో కూర్చుని స్టోరీ లైన్ పై చర్చ సాగింది. మొత్తం కథ ఆ బీచ్ లోనే వచ్చేసింది.

కథ విన్నాక వాళ్లిద్దరూ ఫ్లాట్ అయ్యారు. ఈలోగా హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. దిల్ మూవీకి వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా చేయాలనీ చెప్పడంతో స్టోరీ బాగ్ లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసాడు. అప్పటివరకూ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న దిల్ రాజు ఆ మూవీతోనే నిర్మాతగా వచ్చాడు. లొకేషన్ లో సైలెంట్ గా ఉంటూ లోతుగా విషయాలు చెప్పేవాడు.

దీంతో దిల్ రాజు,వినాయక్ లకు సుకుమార్ పై మంచి భావన ఏర్పడింది. దిల్ హిట్టయ్యాక నీకు ఛాన్స్ ఇస్తా కథ రెడీ చేసుకో అని దిల్ రాజు హామీ కూడా ఇచ్చేసాడు. దిల్ సూపర్ డూపర్ హిట్ కొట్టడం తో ఇచ్చిన మాట ప్రకారం ఓ తమిళ సినిమా రీమేక్ కి రెడీ అవ్వమని చెప్పాడు. రీమేక్ వద్దని,తన కథతోనే చేస్తానని సుకుమార్ అనేశాడు. సరే కథ చెప్పమని దిల్ రాజు అడిగాడు. వెంటనే చెప్పలేదు.

నలుగురైదుగురు కూర్చుని మాట్లాడకుంటూ కథ విషయం ప్రస్తావించిన దిల్ రాజు,… అప్పటికప్పుడు సుకుమార్ ని పిలిచి ఒకే చెప్పేసాడు. నితిన్,ప్రభాస్, రవితేజాలను కలిసినా పనవ్వలేదు. కొత్త హీరో బెటర్ అని నిర్ణయించి అల్లు అర్జున్ ని కరెక్ట్ అని చెప్పడంతో దిల్ రాజు ఎప్రోచ్ తో బన్నీ కథ విన్నాడు. అప్పటికే 96స్టోరీస్ విన్న బన్నీకి ఇది కొత్తగానే అన్పించి, ఒకే అన్నాడు.అయితే అల్లు అరవింద్ ఒకే చేయాలి కదా.

అరవింద్ కి చెబితే ఎక్కడో ఏదో మిస్సయిందన్న సందేహం రావడంతో మూడురోజుల్లో మార్పులు చేస్తామని చెప్పి వచ్చేసి, పదిరోజులు కూర్చుని మరీ స్క్రిప్ట్ పక్కాగా చేసారు. కానీ అరవింద్ ఒకే చేయకపోతే పవన్ కళ్యాణ్ ని ఎప్రోచ్ అవ్వాలి కానీ ఎలా అని సుకుమార్ మదనపడుతున్న సమయంలో .. అరవింద్ కి ఎదో చెప్పారట. స్క్రిప్ట్ రెడీ అయితే ఒకే చేస్తారట అని ఎవరో చెప్పడంతో దిల్ రాజు ఆనందం వ్యక్తంచేసూ సుకుమార్ ని అరవింద్ దగ్గరికి పంపాడు.

ఇంకో కథ ఉంది ,అదా ఇదా ఏది ముందు స్టార్ట్ చేయాలనే సందేహంగా ఉందని అరవింద్ చెప్పడంతో పదిరోజులు సుకుమార్ నరకం చూసాడు. మొత్తానికి గ్రీన్ సిగ్నల్ పడింది. చిరంజీవికి నచ్చేసింది. కిట్ కాట్ యాడ్ మోడల్ అను మెహతా హీరోయిన్శి. ఇక శివబాలాజీ ఇలా అందరినీ క్లియర్ చేసారు.

మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఒకే. తమిళ ఛాయాగ్రాహకుడు రత్నవేలు కెమెరామెన్ గా పెట్టాడు. ఇక టైటిల్ గా ఆర్య ఖరారు. ఆర్య అంటే సఙ్కసృతంలో మొదటివాడు అని అర్ధం. బన్నీ లుక్స్ అన్నీ మార్చేశాడు. 2003 నవంబర్ లో అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్ క్లాప్ కొత్తగా, పవన్ స్విచ్ఛాన్ చేయడంతో షూటింగ్ స్టార్ట్.

రాఘవేంద్రరావు తొలిషాట్ డైరెక్షన్. ఇక టీమ్ హుషారుగా చేసుకుంటూ పోయింది. 80రోజుల షూటింగ్ 120రోజులకు చేరి,బడ్జెట్ పెరిగింది. 2004మే7న రిలీజ్. ఉదయం ఆటకు డివైడ్ టాక్. సాయంత్రానికి సూపర్ హిట్ టాక్. నాలుగు కోట్లతో తీస్తే, 16కోట్లు పైనే వసూలు చేసింది. ఈమూవీ బన్నీని స్టైలిష్ స్టార్ ని చేసింది. సుకుమార్ ని తొలిసినిమా స్టార్ డైరెక్టర్ ని చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."