MoviesTollywood news in telugu

Gruhalakshmi serial డైరెక్టర్ టాప్ హీరోయిన్ భర్త అని తెలుసా?

Gruhalakshmi serial Director : ప్రతి రోజు tv లో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ఈ సీరియల్స్ కూడా సినిమాలకు మించి డ్రామా కలిగి ఉంటున్నాయి. చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. సీరియల్ గురించి ఏ సమాచారం ఉన్నా తెలుసుకోవటానికి అభిమానులు ఆసక్తిగా ఉంటారు.

ప్రస్తుతం Tv సీరియల్స్ చూడని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. సినిమాలతో సమానంగా బుల్లితెర సీరియల్స్ కి డిమాండ్ ఉండడంతో చాలామంది సీరియల్స్ లో నటించడం చేస్తుంటే, వీటిని నిర్మించేవాళ్ళు, డైరెక్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు.

ఇక తెలుగులో టాప్ టీఆర్పీ రేటింగ్ లో సెకండ్ ప్లేస్ లో నిల్చిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతోంది.ఇందులో ముఖ్య పాత్ర తులసి క్యారెక్టర్ లో కస్తూరి, తులసి భర్త క్యారెక్టర్ లో నందు కూడా బాగా నటిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే తమ పాత్రల్లో జీవిస్తున్నారు. తులసి కి, భర్తకి మధ్య విడాకుల సమస్య, కుటుంబ సమస్యల సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. జనం కూడా బాగా లీనమయ్యారు. ఇక ఈ సీరియల్ లో ఇద్దరు కీలక వ్యక్తులున్నారు.

అందులో ఒకరు డైరెక్టర్ విజయకృష్ణ, మరొకరు నిర్మాత ప్రభాకర్. సీరియల్ హీరోయిన్ భావనకు విజయకృష్ణ భర్త. ఇక విజయకృష్ణ ఇంటింటి గృహాలక్ష్మితో పాటు దేవత సీరియల్ ని కూడా డైరెక్ట్ చేసారు. తెలుగు తమిళ సీరియల్స్ కి డైరెక్టర్ గా చేసాడు.