Devotional

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి కుభేరులు కాబోతున్నారు

Makar Sankranti 2024: హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాతి అనేది అతి ముఖ్యమైన పెద్ద పండుగ. పుష్య మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం వలన ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు,కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి 15 వ తేదీన వచ్చింది. సూర్యుడు దనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజును బట్టి వస్తుంది. సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలను వేసుకొని దీపం వెలిగించాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమిటంటే ఈ సంక్రాంతి నుండి కొన్ని రాశుల వారు పడుతున్న బాధలు,కష్ఠాలు అన్ని తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.

మకర రాశి
మకర రాశి వారికి ఈ సంక్రాతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ రోజు ఏమి చేసిన కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి,ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. సంక్రాంత్రి నుండి వీరి పరిస్థితి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఆర్ధికంగా బాగుంటుంది. అలాగే చేతికి అందాల్సిన సహనం అందుతుంది.

కెరీర్ ని మంచి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఇదే మంచి సమయం. స్నేహితులతో ఎక్కువగా గడుపుతారు. అలాగే ఉద్యోగం తర్వాతే ఏదైనా అనే మీ ధోరణి నలుగురికి స్ఫూర్తిని ఇస్తుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. లక్ష్మి దేవి,దుర్గా దేవి ఆలయాలకు వెళ్లి పూజ చేయించుకోవాలి.

మేష రాశి
సంక్రాంతి నుంచి ఈ మేష రాశివారికి ఇంటిలో చాలా ప్రశాంతంగా ఆనందమగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది. చాలా ఉల్లాసంగా ఉంటారు. పిల్లల వైపు నుండి అన్ని ఆనందకరమైన వార్తలను వింటారు. దాంతో మీ సంతోషం,ఆనందం రెట్టింపు అవుతాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. దాంతో ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు.

ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉన్నత అధికారుల మెప్పు పొందుతారు. స్థిరస్తుల కొనుగోలు చేస్తారు. స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృత్తికి సంబందించి అన్నీ విషయాలు,వ్యవహారాలు అన్నీ అనుకూలంగానే ఉంటాయి.

సింహా రాశి
సింహా రాశివారికి ఈ సంవత్సరం కొన్ని సమస్యలు ఎదురు అయినా సరే ఈ సంక్రాంతి నుంచి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వీరికి వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా పట్టుకొని సద్వినియోగం చేసుకుంటారు. దాంతో ఈ రాశివారు ఉన్నత స్థితికి చేరుకుంటారు.

కొత్త పరిచయలకు కాస్త ధూరంగా ఉండటం ఉత్తమం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారం అన్న రీతిలో ఉంటుంది. వీరు ఏమి చేసిన బాగా కలిసివస్తుంది. కుటుంబం నుండి మంచి సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా భార్య నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది.

తుల రాశి
తుల రాశివారికి సంక్రాంతి తర్వాత ఆర్ధికంగా బాగా స్థిరపడతారు. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గెలుపు ఓటములకు భయపడకుండా ముందడుగు వేస్తే విజయం వీరి సొంతం అవుతుంది. ఏమైనా సమస్యలు వస్తే వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి.