White Hair:వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు అనేది అసలు ఉండదు
White Hair Turn Black: ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే రావటంతో…మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. వాటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో సమస్య నుండి బయట పడవచ్చు.
ఒక ఉల్లిపాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి కచ్చా పచ్చాగా దంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి ఉల్లిపాయ ముక్కలు,కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి,ఒక స్పూన్ బియ్యం,రెండు స్పూన్ల కాఫీ పొడి, 5 లవంగాలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


