పంచదారలో ఇది కలిపి రాస్తే చాలు 2 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ మాయం
Tomato and sugar Black Heads Home Remedies In telugu:మనలో చాలా మంది ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. అయితే ముఖం మిద Black Heads వంటివి వచ్చినప్పుడు ముఖం కాంతి లేకుండా నిస్తేజంగా మారుతుంది. ప్రస్తుతం మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి.
వీటిని తొలగించుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలను చేసిన అవి ఫలితాన్ని ఇవ్వకపోవటం వంటి కారణాలతో చాలా మంది డిప్రెషన్ కు గురవుతుంటారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. అలాగే దుమ్ము, ధూళి ప్రాంతాల్లో తిరగడం వలన ముఖంపై ఉండే చర్మ రంద్రాలలో బాక్టీరియా చేరి బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి.
అయితే వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది. ఈ చిట్కా కోసం పంచదార, Tomato ఉపయోగి స్తున్నాం. ఈ రెండు చర్మ సంరక్షణలో సహాయపడి బ్లాక్ హెడ్స్ నివారణకు సహాయపడతాయి. Tomatoను సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార వేసి దానిలో కట్ చేసిన టమోటా ముక్కను అద్ది బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దాలి. ఒక నిమిషం ఇలా రుద్దిన తర్వాత పావుగంట అలా వదిలేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే క్రమంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
టమోటాలో ఆమ్ల లక్షణాలు మరియు పొటాషియం మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గించటంలో సహాయ పడుతుంది. పంచదార చర్మంపై మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్ తొలగించటమే కాకుండా నల్లని మచ్చలు,మొటిమలను కూడా తొలగిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.