MoviesTollywood news in telugu

Krishna Mukunda Murari Serial: ‘కృష్ణ ముకుంద మురారి’లో రేవతి (మాధవి) గురించి ఈ విషయాలు తెలుసా..?

Krishna Mukunda Murari Serial:‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి పేరు రావటమే కాకుండా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మాధవి గురించి తెలుసుకుందాం. ఈ సీరియల్ లో మాధవి రేవతి పాత్రలో నటిస్తుంది. రాయలసీమ కర్నూల్‌ లో పుట్టి పెరిగిన మాధవి నంద్యాలలో కోడలిగా అడుగు పెట్టారు.

పెళ్లి అయ్యి పిల్లలు పెద్దవారు అయ్యాక ఈ రంగానికి వచ్చి సక్సెస్ అయ్యారు. నటనా రంగానికి రాక ముందు మాధవి బ్యుటీషియన్‌గా పార్లర్ నడిపేవారు. పదవ తరగతి వరకు చదివిన మాధవికి డాన్స్, యాక్టింగ్, గేమ్స్ అంటే ఇష్టం.

యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. అలా చేస్తూ ‘మూడు ముళ్ల బంధం’ సీరియల్‌కి సెలెక్ట్ అయ్యి.. ఆ తరువాత ‘ఆడదే ఆధారం’, ‘జాబిలమ్మ’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘గృహలక్ష్మి’, ‘కృష్ణ’, ఇలా కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా మంచి మంచి పాత్రలు చేస్తూ గత పదేళ్లుగా బిజీ ఆర్టిస్ట్‌గా సక్సెస్ గా ముందుకు సాగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."