Movies

Tollywood:పూరి జగన్నాథ్ పెళ్ళికి తాళి బొట్టు కొనిచ్చిన టాప్ యాంకర్ ఎవరో తెలుసా?

Puri jagannadh marriage:టాలీవుడ్ లో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చిన దర్శకులలో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకరు.ఈయన సినిమాల్లోకి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు పని చేశాడు.అయితే ఆ తర్వాత దర్శకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన టువంటి బద్రి అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

వచ్చి రావడంతోనే మంచి సాలిడ్ హిట్ అందుకున్నటువంటి పూరి జగన్నాథ్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.కానీ అంతకు ముందు మాత్రం పూరి జగన్నాథ్ చాలా కష్టాలు పడ్డాడు.తాజాగా పూరి జగన్నాథ్ తన పెళ్ళికి సంబందించిన పలు ఆసక్తికర అంశాలను తన అభిమానులతో పంచుకున్నాడు.

అప్పట్లో పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున నటించిన “నిన్నే పెళ్ళాడుతా” అనే చిత్రానికి పనిచేస్తున్న సమయంలో తన భార్యను ప్రేమించానని, అనుకోని కారణాలవల్ల వెంటనే ఆమెను పెళ్లి కూడా చేసుకోవాల్సి వచ్చిందని కూడా తెలిపాడు.

కానీ తన భార్యను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తన వద్ద డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే తన స్నేహితురాలు యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొన్ని ఇచ్చిందని, అలాగే ఆర్టిస్టుగా పని చేస్తున్నటువంటి హేమ పట్టుబట్టలు కొని తెచ్చిందని తెలిపాడు.

మరికొందరు తన స్నేహితులు కూడా తన పెళ్లికి కావలసిన సామాగ్రి ఈ విషయంలో సహాయం చేశారని అలాంటి పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకుంటానని ఊహించలేదని, కానీ తన స్నేహితులు చేసిన సాయం మాత్రం ఎప్పటికి మరిచి పోలేదని కొనియాడాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."