Beauty TipsHealth

Long Hair: మీ జుట్టు త్వరగా.. ఒత్తుగా పెరగాలంటే కరివేపాకుతో వీటిని కలిపి రాసుకోండి..!

How To Stop Hair Fall At Home in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితులు,మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య ఉంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలామంది కంగారు పడిపోతారు. కంగారుపడి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే మన ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నిస్తే కచ్చితంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏమిటో కూడా తెలుసుకుంటే ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

ఒక గిన్నెలో గ్లాసున్నర నీటిని పోసి దానిలో గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక స్పూన్ kalonji seeds, అరస్పూన్ మెంతులు వేసి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి కొంచెం చల్లారాక జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన మెంతులు,కరివేపాకు, kalonji seeds ఇంచుమించుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య నుండి బయటపడండి. కాస్త శ్రద్ద పెడితే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.