Healthhealth tips in telugu

How to Stop Sneezing:ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా…ఇలా చేస్తే క్షణంలో తుమ్ములు తగ్గిపోతాయి

How to Stop Sneezing : వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా, డస్ట్ ఎలర్జీ కారణంగా ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తుమ్ములు అనేవి పక్క వారిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. తుమ్ములు రాకుండా తగ్గాలంటే మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

తుమ్ములు వచ్చినప్పుడు అల్లంతో టీ తయారు చేసుకుని తాగితే తుమ్ముల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే వెల్లుల్లి కూడా తుమ్మల ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని చితక్కొట్టి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా చేయడం వలన తుమ్ములు తగ్గుతాయి.యాంటీ వైరల్ లక్షణాలు ఉన్న దాల్చిన చెక్క పొడి కూడా తుమ్మలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక స్పూన్ తేనెలో పావు స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి తీసుకోవాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా తుమ్మలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు. స్పూన్ లో సగం మిరియాల పొడి వేసి బాగా కలిపి తాగిన మంచి ఉపశమనం కలుగుతుంది.ఈ చిట్కాలను పాటించడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది తుమ్ములు తగ్గడానికి ఇప్పుడు చెప్పిన చిట్కాలలో ఏదో ఒక దానిని ప్రయత్నం చేయండి ఈ చిట్కాలు చాలా ఎక్కువగా పని చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.