Beauty TipsHealth

Warts Removing :ఇలా చేస్తే 1 రోజులో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి…డాక్టర్ అవసరం ఉండదు

warts In Telugu :పులిపిర్లు అనేవి సాధారణమైన సమస్య. ప్రతి 15 మందిలో ఒక్కరు పులిపిర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పులిపిర్లను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి యుక్తవయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఇవి రావటానికి ప్రధానకారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి.

ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఒక బౌల్ లో రెండు వెల్లుల్లి పాయలను పేస్ట్ గా చేసి వేయాలి. దానిలో అర స్పూన్ నిమ్మరసం,పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి బ్యాండెజ్ వేయాలి.

ఒక గంట తర్వాత బ్యాండెజ్ తీసేసి శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ఉదయం,సాయంత్రం చేస్తూ ఉంటే పులిపిర్లు రాలిపోతాయి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. వెల్లుల్లి,నిమ్మరసంలో ఉన్న లక్షణాలు పులిపిర్లను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News