Beauty TipsHealth

White Hair:10 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్లజుట్టు అనేది ఉండదు

White Hair Tips in telugu :వాతావరణంలో కాలుష్యం,జుట్టుకి సరైన పోషణ లేకపోవటం,ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతుంది. తెల్లజుట్టు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. జుట్టు నల్లగా ఉంటేనే అందం.

కానీ ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఆలా జుట్టు తెల్లబడేసరికి చాలా మానసికంగా కృంగిపోతున్నారు. అయితే జుట్టు రంగు అనేది చిన్న వయస్సులోనే నిర్ణయించబడుతుంది. జుట్టు కింద భాగంలో ఉండే మెలనిన్ కణాలు జుట్టుకి రంగుని ఇస్తాయి.

మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు అనేది ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో జుట్టు తెల్లబడటం ప్రారంభం అవుతుంది. తెల్ల జుట్టు రావటం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరు కంగారు పడి హెయిర్ డ్రై వేసుకోవటానికి ఆసక్తి చూపుతారు. హెయిర్ డ్రై లో ఉండే రసాయనాలు జుట్టుకు,తల మీద చర్మానికి హాని కలుగుతుంది.

కాబట్టి మనం సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్ధాలతో తెల్లని జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఒక ఇనుప ముకుడు పొయ్యి మీద పెట్టి దానిలో రెండు స్పూన్ల హెన్నా పొడి, రెండు స్పూన్ల ఉసిరి పొడి, బంగాళాదుంప రసం వేసి సిమ్ లో పెట్టి కలుపుతూ 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి అరగంట తర్వాత ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించాలి.

షాంపూతో తలస్నానం చేసి జుట్టు బాగా ఆరాక ఈ పేస్ట్ జుట్టు మొదళ్లు నుండి చివరి వరకు బాగా పట్టించి గంట అయ్యాక మామూలుగా అంటే షాంపూ లేకుండా తలస్నానం చేయాలి, ఈ విధంగా ఉదయం సమయంలో చేస్తే రాత్రి సమయంలో జుట్టుకి కొబ్బరి నూనె పట్టించాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.