Beerakaya Karam Podi:బీరకాయ కారం పొడి ఇలా చేసి పెడితే.. 15రోజులు వరకు వాడుకోవచ్చు
Beerakaya Karam Podi Recipe: తెలుగు వారి భోజనం అంటే పచ్చల్లు,కూరలు,పొడులు తప్పకుండ ఉండవల్సిందే. మొదటి వేడి వేడి అన్నం లో ఒక ముద్ద కారం పొడి లేదా ,చట్నీ లో నెయ్యి కలుపుకోని తింటే ఆ టేస్టే వేరు.బీరకాయ తొక్క తో కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి
కావాల్సిన పదార్ధాలు
బీరకాయ పొట్టు – ½ kg బీరకాయ తొక్కు
వాము – 1 టీస్పూన్
ఎండు మిర్చి – 10-15
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
చింతపండు – 8 గ్రాములు
తయారీ విధానం
1.ముందుగా బీరకాయ తొక్కను నీళ్లు యాడ్ చేయకుండ బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి ఎండుమిర్చి వేసి వేపుకోని పక్కనపెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ లో మినపప్పు వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
4.అదే ప్యాన్ మరో టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోని బరకగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ పొట్టును పొడిగా తయారయ్యే వరకు వేపుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి పసుపు,వాము,వేసి కలుపుకోవాలి.
6.ఇప్పుడు మిక్సి జార్ లోకి వేపుకున్న మినపప్పు, ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు,చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి వేపుకున్న బీరకాయ పొట్టును వేసి గ్రైండ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు బీరకాయ కారంలోకి ఉప్పు,కారం అడ్జెస్ట్ చేసుకోని స్టోర్ చేసి పెట్టుకోవడమే.


