Beauty TipsHealth

Hair Care Tips:వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Rice Hair Fall Home Remedies In telugu: జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య రాగానే కంగారూ పడకుండా ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఈ చిట్కా కోసం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఇవి వంటింటిలో అందుబాటులో ఉంటాయి. వాటిలో మొదటిది మెంతులు. మెంతులను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.

మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్., యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్య లేకుండా చేస్తాయి. తలమీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాక జుట్టు మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

ఇక రెండోవది బియ్యం. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా ఉండేలా కూడా చేస్తుంది. బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతులు, రెండు స్పూన్ల బియ్యం వేసి నీటిని పోసి నాలుగు గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.