MoviesTollywood news in telugu

Tollywood:పవన్ చెల్లెలిని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా ?

Sandhya: తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్నా చెల్లెళ్ళ బంధంతో తీసిన సినిమాలు చాలావరకూ హిట్ అయ్యాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్నవరం మూవీ కూడా అన్నా చెల్లెళ్ళ బంధానికి నిదర్శనంగా నిల్చింది. ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో పవన్ చెల్లెలుగా నటి సంధ్య నటించింది. ఈమె తమిళంలో ప్రముఖ డైరెక్టర్ శక్తి వేల్ తెరకెక్కించిన కాదల్ (తెలుగులో ప్రేమిస్తే) మూవీతో ఎంట్రీ ఇచ్చింది సంధ్య.

కేరళ లోని త్రివేండ్రం లో పుట్టిన సంధ్య చెన్నైలో స్టడీస్ పూర్తిచేసింది. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఎంట్రీ ఇచ్చిన సంధ్య వరుస ఛాన్స్ లు అందిపుచ్చుకుంది. నటిగా రాణిస్తున్న సమయంలో తమిళనాడుకి చెండియాన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లాడింది. వీళ్ళకి ఓ పాప కూడా ఉంది.

తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఈమె తన ఫ్యామిలీతో చెన్నై పరిసర ప్రాంతంలో మకాం ఉంటోంది.