Beauty TipsHealth

Cracked Heels:పైసా ఖర్చు లేకుండా 3 రోజుల్లో కాళ్ళ పగుళ్లను తగ్గించే అద్భుతమైన చిట్కా

Cracked Heels Home Remedies : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు,ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి.

డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసు కోవచ్చు. పాదాల పగుళ్లను అసలు అశ్రద్ద చేయకూడదు. పాదాల పగుళ్లను తగ్గించటానికి బియ్యంపిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

దాదాపుగా ప్రతి ఇంటి వంటింటిలో బియ్యంపిండి తప్పనిసరిగా ఉంటుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యంపిండి, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి మందమైన పేస్టులా తయారుచేయాలి. పగుళ్లు మరీ ఎక్కువగా ఉంటే.. టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపవచ్చు. పాదాలను పది నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచాలి.

ఆ తర్వాత పాదాలను బియ్యం పిండి పేస్టుతో మృదువుగా రుద్దాలి. పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే పూర్తిగా తగ్గేవరకూ ఇలాగే చేయాలి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.