Beauty TipsHealth

Hair Care Tips:ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది

Hair Fall And Dandruff oil In telugu : ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారం అలవాట్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ పెడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

జుట్టురాలే సమస్యకు మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలను వాడాల్సిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న నూనెతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక గిన్నెలో 200 ml కొబ్బరి నూనె తీసుకొని దానిలో నాలుగు తమలపాకులు ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత కరివేపాకు ఆకులను వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యిమీద పెట్టి బాగా మరిగించాలి. తమలపాకులు కరివేపాకు బాగా ఫ్రై అయి నలుపు రంగు వచ్చేవరకు పొయ్యిమీద ఉంచాలి. ఈ నూనె చల్లారాక ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను ప్రతి రోజూ రాసుకోవాలి. ఈ నూనెను. కొంచెం తీసుకొని చేతివేళ్ళతో కుదుళ్ళు అంటే తల మీద చర్మం మొత్తానికి అప్లై చేసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.

అలాగే తలమీద చర్మం మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు బాగా పెరుగుతుంది. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. తమలపాకు కూడా జుట్టు బాగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ నూనెను రెగ్యులర్ గా వాడితే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.